ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రూ. 13కోట్లతో మైదుకూరులో అబివృద్ధి పనులు' - మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి వార్తలు

కడప జిల్లా మైదుకూరులో అభివృద్ధి పనులు చేపట్టి.. వాటిని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేస్తామని ఎమ్మెల్యే రఘురాంరెడ్డి తెలిపారు. సచివాలయాలకు రోడ్లు, మురుగు నీటి కాలువలు వంటి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.

raghuram reddy, mla
రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే

By

Published : Oct 15, 2020, 4:21 PM IST

Updated : Oct 15, 2020, 5:30 PM IST

వాటర్ గ్రిడ్ కింద మంజూరు చేసిన ఇంటింటి కుళాయిలకు సంబంధించి వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

నియోజకవర్గంలోని సచివాలయాలకు రూ. 3 కోట్లతో సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మురుగు కాలువల కోసం మరో రూ. 10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. బ్రహ్మంసాగర్ జలాశయంలో దాదాపు 14 టీఎంసీలు నీరు నిల్వ చేసేలా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బ్రహ్మంగారిమఠం, బద్వేలు నియోజకవర్గాల పరిధిలోని రైతులకు రబీలో పంట సాగుకు నీరు అందుబాటులో ఉందని స్పష్టంచేశారు. భారీ వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని చెప్పారు.

Last Updated : Oct 15, 2020, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details