లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హిజ్రాలకు తమ వంతు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ అన్నారు. కడప కోర్టు ఆవరణలో 50 మంది హిజ్రాలకు ఆయన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా చాలామంది అవస్థలు పడుతున్నారని... ఎలాంటి ఉపాధి లేని హిజ్రాలకు తమ వంతుగా సహాయం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
హిజ్రాలకు నిత్యావసర సరుకుల పంపిణీ - కడపలో హిజ్రాలకు నిత్యావసర సరుకుల పంపిణీ
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న హిజ్రాలకు కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ నిత్యావసర సరుకులు అందజేశారు. ఎలాంటి ఉపాధి లేని హిజ్రాలకు సాయం అందించటం చాలా ఆనందంగా ఉందని జడ్జి పేర్కొన్నారు.
![హిజ్రాలకు నిత్యావసర సరుకుల పంపిణీ Kadapa District judge distributes essential commodities to hijras](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7314420-34-7314420-1590217705079.jpg)
హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి