కరోనా విస్తృతి కారణంగా... ఈ ఏడాది వినాయకచవితి పండుగకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. మంగళవారం కడప జిల్లా జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ, డీఎస్పీ సమక్షంలో సమావేశం నిర్వహించారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 16 మండలాల్లో వినాయక చవితి పండుగకు అనుమతి లేదని అధికారులు చెప్పారు.
'వినాయకచవితికి అనుమతి లేదు'
వినాయక చవితిని ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలని.. వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేదని కడప జిల్లా జమ్మలమడుగు అధికారులు స్పష్టం చేశారు.
ఆర్డీఓ, డీఎస్పీ సమక్షంలో సమావేశం
వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో వినాయకుని బొమ్మలను కూర్చోబెట్టరాదని సూచించారు. పండుగ రోజున ఎవరి ఇళ్లలో వారు వినాయకుని విగ్రహాన్ని తీసుకుని పూజ చేసుకోవాలని చెప్పారు. నిమజ్జనం చేయాలంటే ఆ ఇంటి యజమాని ఒక్కరే నీటిలో నిమజ్జనం చేసుకోవచ్చని చెప్పారు. మేళ తాళాలతో ఊరేగింపుగా ఊరేగించిన, వీధుల్లో కూర్చోబెట్టిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.