కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పవర్ సెక్టార్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అలాగే ఉద్యోగుల ఇతర సమస్యల పట్ల చర్యలు తీసుకోవాలని కోరుతూ... నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యేలా జేఏసీ నిర్ణయించింది. అందులో భాగంగా రెండో రోజు ఉదయం ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద ఉద్యోగుల ఐక్యత వర్దిల్లాలి అని నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్ల సాధనకై ఆర్టిపి ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలతోనే విధులకు హాజరయ్యారు.
రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగుల నిరసన - రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగుల నిరసన
రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగులంతా మేనేజ్మెంట్ కి వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పవర్ సెక్టార్ ప్రైవేటీకరణ, ఉద్యోగుల ఇతర సమస్యల పట్ల మేనేజ్మెంట్ స్పందించాలని కోరుతూ నినాదాలు చేశారు.

రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగుల నిరసన
TAGGED:
latest updates in kadapa