ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. విధుల నుంచి తొలగింపే' - గ్రామ వాలంటీర్లు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలంటీర్లు అశ్రద్ధ వహిస్తే విధుల నుంచి తప్పిస్తామని బద్వేల్ పురపాలక కమిషనర్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. కడప జిల్లా బద్వేల్​లో 2వ రోజు వాలంటీర్లకు శిక్షణ తరగతులు నిర్వహించగా.... 170 మందిలో ఏడుగురు గైర్హజరు కావటంపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

వాలంటీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విధుల నుంచి తొలగిస్తాం

By

Published : Aug 7, 2019, 9:07 PM IST

వాలంటీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విధుల నుంచి తొలగిస్తాం
కడప జిల్లా బద్వేలు పురపాలకలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో గ్రామ వాలంటీర్లకు రెండోరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. మెుత్తం 170 మందికి ఏడుగురు గైర్హజరు కాగా వారిపై కమిషనర్ కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ తీసుకునే విషయంలో అశ్రద్ధ ఉంటే ఇక పనెలా చేస్తారని వాలంటీర్లను ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే వారిని నిర్మొహమాటం లేకుండా విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ప్రతి ఒక్కరూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నవరత్నాలు పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ఆయన వివరించారు.

ABOUT THE AUTHOR

...view details