కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ తో గండికోట ముంపు నిర్వాసితుల చర్చలు విఫలం అయ్యాయి. గడిచిన 10 రోజులుగా ముంపు బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిహారంతో పాటు ఇతర సమస్యలపై జిల్లా కలెక్టర్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిర్వాసితులతో చర్చలు జరిపారు.
గండికోటలో 16 టీఎంసీల నీటిని నిల్వ ఉంచామని.. ప్రజలందరూ తమ గ్రామాలను ఖాళీ చేయాల్సిందేనని కలెక్టర్ హరికిరణ్ సూచించారు. ఖాళీ చేశాకే పరిహారం అందించాల్సి ఉందన్న కలెక్టర్ .. పది రోజులు గడువు విధించారు. ఈ క్రమంలో చర్చలు విఫలం కావడంతో ముంపు నిర్వాసితులు వెనుదిరిగారు. పరిహారం అందించే వరకూ తాము ఖాళీ చేయమని ముంపు నిర్వాసితులు స్పష్టం చేశారు.