ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్‌ హరికిరణ్‌ - కడపలో అభివృద్ధి కార్యక్రమాలపై వార్తలు

కడప జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూ సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్.. అధికారులను ఆదేశించారు. భూసేకరణలో అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేసి జిల్లా అభివృద్ధికి దోహదపడాలని అన్నారు.

kadapa collector on land acquisition
కలెక్టర్ హరికిరణ్

By

Published : Sep 16, 2020, 8:16 AM IST

కడప జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సత్వరమే భూసేకరణ చేపట్టాలని పాలనాధికారి హరికిరణ్‌.. సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని తన ఛాంబరులో మంగళవారం సంయుక్త పాలనాధికారిణి గౌతమి, డీఆర్వో మాలోలతో కలిసి భూసేకరణ కమిటీ సమావేశం నిర్వహించారు. కొప్పర్తి, విమానాశ్రయం, ఏపీఐఐసీకి సంబంధించిన వాటిని ప్రాధాన్యంగా సేకరించాలన్నారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్లు పృథ్వీతేజ, కేతన్‌గార్గ్‌, ప్రాంతీయ మేనేజరు జయలక్ష్మి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆర్థికసాయంగా ఉపయోగించుకోవాలి

వ్యాపార పెట్టుబడిగా ‘వైఎస్‌ఆర్‌ చేయూత’ ఆర్థిక సాయాన్ని ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పాలనాధికారి హరికిరణ్‌ అన్నారు. తన ఛాంబరులో మంగళవారం ఆయన సంయుక్త పాలనాధికారి ధర్మచంద్రారెడ్డితో కలిసి జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. స్వయం సహాయక సభ్యులు తమకు నచ్చిన వ్యాపారంలో పెట్టుబడిగా ఉపయోగించే విధంగా అధికారులు ప్రోత్సహించాలన్నారు. ముఖ్యమంత్రి బహుళజాతి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో మొదటి విడతగా మెప్మా ఆధ్వర్యంలో పురపాలక సంఘానికి రెండు దుకాణాల నిర్వహణకు సిద్ధమయ్యామని, డీఆర్‌డీఏ పరిధిలో ఒక్కో మండలానికి రెండు చొప్పున వంద దుకాణాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

ఇదీ చదవండి:

రాజధాని భూముల కేసుపై ఏపీ హైకోర్టు స్టే

ABOUT THE AUTHOR

...view details