ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్టీల్ కార్పొరేషన్ ఎండీతో కలెక్టర్ హరికిరణ్ సమీక్ష - వైయస్ఆర్ స్టీల్ ప్లాంట్ తాజా వార్తలు

కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో ప్రభుత్వం వైఎస్​ఆర్ స్టీల్ ప్లాంటు నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతుంది.ఇందుకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టరేట్​లో కలెక్టర్ హరికిరణ్ స్టీల్ కార్పోరేషన్ ఎండీ శన్మోహన్​తో చర్చించారు.

స్టీల్ కార్పొరేషన్ ఎండీతో కలెక్టర్ హరికిరణ్ సమీక్ష
స్టీల్ కార్పొరేషన్ ఎండీతో కలెక్టర్ హరికిరణ్ సమీక్ష

By

Published : Nov 5, 2020, 9:48 AM IST

కడప జిల్లా జమ్మలమడుగు డివిజన్ సున్నపురాళ్లపల్లెలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ స్టీల్ ప్లాంటు నిర్మాణం చేపట్టబోతుంది. ఇందుకు సంబంధించిన భూసేకరణ తదితర అంశాలపై కలెక్టరేట్​లో సమీక్ష జరిగింది. స్టీల్ కార్పొరేషన్ ఎండీ ఎస్.శన్మోహన్​తో కలెక్టర్ సి.హరికిరణ్ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈనెల 11న ప్రతిపాదిత స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయు ప్రదేశంలో చేయనున్న ప్రజాభిప్రాయ సేకరణ, రాబోయే మూడు నెలల కాలంలో చేపట్టాల్సిన కార్యాచరణపై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి

ప్రొద్దుటూరులో ఆరుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details