ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన

పులివెందులలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని కడప జిల్లా కలెక్టరు హరికిరణ్‌ శుక్రవారం పరిశీలించారు. పాడా ప్రత్యేకాధికారి అనిల్‌కుమార్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఆయన పోలేపల్లె సమీపంలోని ఆరు ఎకరాల స్థలాన్ని చూశారు. నిరుద్యోగులకు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

skill development center in Pulivendula
నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన

By

Published : Aug 29, 2020, 11:12 AM IST

పులివెందుల శివారు పోలేపల్లి సమీపంలోని హెలీప్యాడ్ వద్ద దాదాపు ఆరు ఎకరాలలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి... పాడా ఓఎస్డీ అనిల్ కుమార్, తహసీల్దారులతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ క్షేత్ర స్థాయిలో స్థల పరిశీలన చేశారు. నిరుద్యోగ యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడంలో ఈ సంస్థ ఏర్పాటు కీలకం కానుందని కలెక్టర్ తెలిపారు. స్థానిక యువతకు అలాగే జిల్లాలోని యువతకు ఈ కేంద్రం ఏర్పాటు ఒక వరం అవుతుందన్నారు.

త్వరలోనే ఈ కేంద్రానికి శంకుస్థాపన చేయడానికి అవసరమైన చర్యలను జిల్లా యంత్రాంగం వేగవంతంగా చేపడుతోంది. నైపుణ్యాభివృద్ధి సంస్థకు అవసరమైన స్థలాన్ని, వాటి బౌండరీస్​ను, మ్యాపులను కలెక్టర్ పరిశీలించి... ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే హెలీప్యాడ్​ను కూడా పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details