కడప జిల్లా గండికోట ప్రాజెక్టులో భాగంగా తాళ్లప్రొద్దుటూరు ముంపుకు సంబంధించి సహాయ పునరావాస చర్యలలో భాగంగా కలెక్టర్ హరికిరణ్ సమావేశం నిర్వహించారు.తాళ్ళప్రొద్దుటూరు ముంపువాసులను అక్టోబర్ నాటికి ఖాళీ చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో జేసి ఎం.గౌతమి, ఆర్డిఓ నాగన్నల తదితరులు పాల్గొన్నారు.
'అక్టోబర్ 15నాటికి ఆ గ్రామం మొత్తం ఖాళీ చేయాలి' - latest news of kadapa collector
ప్రభుత్వం గండికోట ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టి 20 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 15 లోపు ఇల్లు కట్టుకుని కడప జిల్లాలోని తాళ్ల పొద్దుటూరు గ్రామాన్ని ఖాళీ చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరి కిరణ్ తాళ్ల పొద్దుటూరు గ్రామస్థులను కోరారు.
kadapa district collector conduct meeting with thalla produtour villagers