రెండు వాహనాల్లో గుట్కా సంచులను తరలిస్తున్న ఇద్దరు విక్రేతలను కడప జిల్లా బద్వేలు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 22 వేల విలువైన గుట్కా సంచులు, కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాతో సంబంధమున్న మరో ముగ్గురు.. పోరుమామిళ్ల, కడపలో ఉన్నారని పట్టణ సీఐ రమేష్ బాబు తెలిపారు. వీరిని త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
గుట్కా విక్రేతలు అరెస్ట్.. సరుకు, కారు, బైకు స్వాధీనం - కడప న్యూస్
గుట్కాను తరలిస్తున్న ఇద్దరిని కడప జిల్లా బద్వేలు పోలీసులు పట్టుకున్నారు. రూ. 22 వేల విలువ చేసే సరుకు, కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ గుట్కా విక్రేతలను పట్టుకున్న పోలీసులు