పల్లె జీవం కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం.. కరవు గ్రామాల్లో వెలుగులు నింపుతోందని కడప జిల్లా సంయుక్త పాలనాధికారి గౌతమి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో.. ఆంధ్రప్రదేశ్ కరవు సంసిద్దత పథకం ఆధ్వర్యంలో.. "పల్లెజీవం - వ్యవసాయ అనుబంధ శాఖల అనుసంధానం" అనే అంశంపై సంబందిత శాఖల అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేసీ గౌతమి హాజరయ్యారు.
జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యం
కరవు ప్రాంతాల్లో వ్యవసాయం, పశు పోషణ రంగాల్లో నూతన, సాంకేతిక విధానాలను అమలు చేయడమే కాక భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుని, సన్న, చిన్నకారు రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆమె అన్నారు. అందులో భాగంగానే వ్యవసాయ అనుబంధ శాఖలను ఈ పథకంతో అనుసంధానం చేశామన్నారు.