కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం రజతోత్సవాలను ఈనెల 29, 30 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. జానమద్ధి హనుమచ్ఛాస్త్రి బ్రౌన్ గ్రంథాలయం నిర్మాణం కోసం ఎనలేని కృషి చేశారని యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి సూర్య కళావతి వెల్లడించారు. ఈ రజతోత్సవాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించామని ఉపకులపతి తెలిపారు. జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కవులు, కళాకారులను కూడా ఆహ్వానించామని పేర్కొన్నారు. అలాగే నేడు విశ్వవిజ్ఞాన వేదిక-గ్రంథాలయం అనే అంశంపై అంతర్జాల శతాధిక కవి సమ్మేళనం నిర్వహించారు.
29, 30 తేదీల్లో సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర రజతోత్సవాలు - Kadapa CP Brown Language Research Center Silver Jubilee latest updates
కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం రజతోత్సవాలను ఈనెల 29,30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లు చేశామని యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి సూర్య కళావతి తెలిపారు. తెలుగుభాష కోసం సీపీ బ్రౌన్ రెండు దఫాలుగా ఐదేళ్ల పాటు కడపలో పని చేశారని ఆమె అన్నారు.
![29, 30 తేదీల్లో సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర రజతోత్సవాలు kadapa cp brown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9660325-272-9660325-1606299273304.jpg)
వేడుకగా జరగనున్న సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర రజతోత్సవాలు