మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షులకు భద్రత కల్పించాలనే పిటిషన్‌పై కడప కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కీలక సాక్షులుగా ఉన్న డ్రైవర్ దస్తగిరి, వాచ్మెన్ రంగన్నకు భద్రత కల్పించాలని సీబీఐ ఈ పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్‌పై విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.
మూడేళ్లలో ఎన్నో మలుపులు..
ముఖ్యమంత్రి జగన్ బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి.. 2019 మార్చి 15న పులివెందులలోని నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. హత్య జరిగిన రోజు తొలుత వివేకా గుండెపోటుతో చనిపోయారని వారి బంధువులు, వైకాపా నాయకులు ప్రకటించారు. ఆ రోజు ఉదయం అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. మధ్యాహ్నానికి హత్య కేసుగా మార్చారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వివేకా హత్య కేసును తేల్చడానికి అదేరోజు సిట్‌ను ఏర్పాటు చేసింది. సార్వత్రిక ఎన్నికల నెల రోజుల ముందు జరిగిన వివేకా హత్య.. రెండు ప్రధాన పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది. హైకోర్టు జోక్యంతో నేతల ఆరోపణలకు అప్పట్లో అడ్డుకట్ట పడింది.
తేలని దోషులు..
వివేకా హత్య జరిగిన సమయంలో కడప జిల్లా ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ శర్మపై ఆరోపణలు రావడంతో బదిలీ వేటు పడింది. ఆ తర్వాత వచ్చిన ఎస్పీ అభిషేక్ మహంతి సారథ్యంలో మరో సిట్ ఏర్పాటైంది. కేసులో కీలక సాక్షులు, అనుమానితులను అధికారులు ప్రశ్నించారు. హత్యా స్థలంలో సాక్ష్యాధారాలు చెరిపివేశారనే అభియోగాలతో ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ను అనే ముగ్గురిని.. 2019 మార్చి 28న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అప్పటికి కేసు కొంతమేర కొలిక్కి వచ్చినట్లు భావించారు. అలాంటి సమయంలో ఎస్పీ అభిషేక్ మహంతి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం సంచలనం సృష్టించింది. ఆయన తర్వాత కడప జిల్లా ఎస్పీగా నియమితులైన అన్బురాజన్ నేతృత్వంలో మూడో సిట్ ఏర్పాటైంది. మొత్తం మూడు సిట్లు కలిపి.. దాదాపు 13 వందల మంది సాక్షులు, అనుమానితులను విచారించినా అసలు దోషులెవరో ఇంతవరకు తేలలేదు.
హైకోర్టును ఆశ్రయించిన వివేకా కుమార్తె