కడప బుగ్గవంక సుందరీకరణలో భాగంగా సమీపంలో ఉన్న పేదల ఇళ్లు తొలగించే ముందు కమలాపురం ఎమ్మెల్యే రవీందర్ నాథ్ రెడ్డి స్థానికంగా నిర్మించిన సినిమా థియేటర్లు పడగొట్టాలని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా కార్యదర్శి సత్తార్ డిమాండ్ చేశారు. దాదాపు 40 ఏళ్ల నుంచి బుగ్గవంక పరివాహక ప్రాంతాల్లో సుమారు 550 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఉన్న ఫలంగా వారిని వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్తారని కడప ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు.
'బుగ్గవంక నిర్వాసితులకు న్యాయం చేయాలి' - కడప కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సత్తార్
కడపలోని బుగ్గవంక సుందరీకరణలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా కార్యదర్శి సత్తార్ డిమాండ్ చేశారు.
బుగ్గవంక నిర్వాసితులకు న్యాయం చేయాలి
బుగ్గవంక సుందరీకరణను తాము స్వాగతిస్తున్నామని.. అయితే నిర్వాసితులకు తొలుత ఇళ్లు నిర్మించిన తర్వాతే పనులు ప్రారంభించాలన్నారు. అంతేగాక నిర్వాసితులకు ఇచ్చే స్థలాలు పట్టణానికి దగ్గరలో ఉండాలన్నారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు.. స్పందించి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి..బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్: రాష్ట్రంలో 4 మరణాలు.. వందలాది కేసులు