ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''ఫ్యాన్లు లేవు.. ఆహారం బాలేదు.. ఏంటిది?'' - latest news on government hostels in kadapa

కడప జిల్లా పులివెందుల మండలం బెస్తవారిపల్లెలోని బాలయోగి గురుకుల బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ హరికిరణ్ తనిఖీ చేశారు. ఏ గదిలోనూ ఫ్యాన్లు లేకపోవడంపై మండిపడ్డారు. వెంటనే ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

kadapa collector visits hostel
బాలయోగి గురుకుల బాలుర వసతి గృహంలో కలెక్టర్​ తనిఖీ

By

Published : Dec 4, 2019, 10:53 AM IST

బాలయోగి గురుకుల బాలుర వసతి గృహంలో కలెక్టర్​ తనిఖీ

కడప జిల్లా పులివెందుల మండలం బెస్తవారిపల్లెలోని బాలయోగి గురుకుల బాలుర వసతి గృహంలో కలెక్టర్ హరికిరణ్ నిన్న రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఏ గదిలోనూ ఫ్యాన్లు లేకపోవడంపై ప్రధానోపాధ్యాయుడు రామచంద్రన్‌ను ప్రశ్నించారు. వెంటనే ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. భోజనం అధ్వానంగా ఉంటోందని విద్యార్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా వసతి గృహాన్ని పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details