ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పనితీరు మెరుగుపరుచుకోకపోతే జీతాల్లో కోత తప్పనిసరి' - kadapa collector fires on ward volunteers

సంతృప్తికరంగా పనిచేయని సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల జీతాల్లో కోత విధిస్తామని.. కడప కలెక్టర్ హెచ్చరించారు. నగరంలోని వివిధ సచివాలయాలను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.

kadapa collector inspect sachivalayams
ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కడప కలెక్టర్

By

Published : Nov 4, 2020, 11:29 PM IST

నిర్ణీత సమయంలో సేవలను అందించకపోతే జీతాల్లో కోత విధిస్తామని.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కడప కలెక్టర్ సి.హరికిరణ్ హెచ్చరించారు. అగాడీ వీధిలోని 36/1, 36/2 వార్డు సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల ఆరా తీశారు.

ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కడప కలెక్టర్

వారం రోజులుగా ప్రజల నుంచి రోజుకో సేవా అభ్యర్థన అందకపోవడంతో.. సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు జనం ముందుకెళ్లి పని చేయడం లేదనేది స్పష్టమవుతోందన్నారు. నగరం నడిబొడ్డులో ఉన్నా అర్జీలు రాలేదంటే.. సిబ్బంది పనితీరు అర్థమవుతోందని మండిపడ్డారు.

వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ.. సచివాలయాల ద్వారా ఎటువంటి సేవలు పొందవచ్చో ప్రజలకు వివరించాలన్నారు. వారికి అవసరమైన సేవలు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు.. సచివాలయాలను సద్వినియోగించుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. ఈ నెలలో పనితీరు మెరుగుపరుచుకోకపోతే జీతాలు నిలిపివేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:డీఎడ్​ పరీక్షలకు అనుమతించాలంటూ కలెక్టరేట్​ ముట్టడి

ABOUT THE AUTHOR

...view details