ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకంపై సంబంధిత అధికారులతో కడప జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ సమీక్ష జరిపారు. ఈ పథకం కింద 18 గ్రామాలు ఎంపికయ్యాయన్నారు. సదరు గ్రామాల ఎమ్ఈవోలు సోషల్ సర్వే ద్వారా కుటుంబ వివరాలు సేకరించి... జూలై 10వ తేదీలోగా నివేదికను సమర్పించాలన్నారు. అలాగే నీటి వనరులు, వైద్య ఆరోగ్యశాఖ, ఉపాధి హామీ పథకానికి చూస్తున్న అధికారుల.... వాటికి సంబంధించిన వివరాలు సేకరించి నివేదిక తయారు చేయాలని ఆదేశాలిచ్చారు. బ్యాంకు అధికారులను సంప్రదించి... చేయూత పథకం ద్వారా ఆ గ్రామాల్లోని ప్రజలకు రుణాలు ఇప్పించాలన్నారు. గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రజల అవసరాలను తెలుసుకోవాలని ఎమ్ఈవోలకు కలెక్టర్ తెలిపారు.
పీఎంఏజీవై పథకంపై అధికారులతో కడప జిల్లా కలెక్టర్ సమీక్ష
కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకానికి ఎంపికైన 18 గ్రామాల కుటుంబ వివరాలు సేకరించాలని అధికారులకు సమీక్షలో తెలిపారు. జూలై 10వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
అధికారులతో కడప కలెక్టర్ సమీక్ష