ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామాల్లో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రత్యేక కమిటీల ఏర్పాటు: కలెక్టర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అనుసరించి గ్రామాల్లో కరోనా వ్యాప్తి అరికట్టడానికి వీసీఎంసీను ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ఈ కమిటీలు ఎప్పటికప్పడు గ్రమాల్లో పరిస్థితిన పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. అధిక కేసులు నమోదైన వీధులు, వార్డులను మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటామన్నారు.

కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్
కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్

By

Published : May 22, 2021, 11:44 AM IST

కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విలేజ్ లెవెల్ కొవిడ్ - 19 మేనెజ్మెంట్ కమిటీ (వీసీఎంసీ)ని ఏర్పాటు చేశామని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ఈ కమిటీ.. గ్రామాల్లో కొవిడ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ విధివిధానాలు సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటుందన్నారు. సర్పంచి ఛైర్మన్​గా, పంచాయతీ సెక్రెటరీ కన్వీనర్​గా వ్యవహరిస్తారని తెలిపారు.

వీసీఎంసీ సభ్యులు కరోనా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అధిక కేసులు నమోదైన వీధులు, వార్డులను మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి.. ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ ఉండాలన్నారు. కొవిడ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో క్రమం తప్పకుండా శానిటేషన్ చేయాలని చెప్పారు. హోం ఐసోలేషన్​లో ఉన్నవారితో సర్పంచులు, వార్డు మెంబర్లు.. ఫోన్ ద్వారా మాట్లాడుతూ మనో ధైర్యాన్ని నింపాలని దిశా నిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details