నివర్ తుపాను ప్రభావంతో కడప జిల్లా అన్ని విధాలా నష్టపోయిందని, విశాల హృదయంతో ఆదుకోవాలని.. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కేంద్ర అధ్యయన బృందానికి నివేదించారు. జిల్లాలో సంభవించిన వరదలు, నష్టాలు, నష్టపరిహార అంచనా వివరాలను.. ఆర్అండ్బీ అతిథి గృహంలో పవర్ పాయింట్ ద్వారా సమగ్రంగా వివరించారు. తుపాను వల్ల మూడు రోజుల్లో దాదాపు 15 సెం.మీల వర్షపాతం నమోదైందని.. ప్రధానంగా రెండు ప్రాజెక్టులు దెబ్బతిని నీరు వృథాగా పోయిందని తెలిపారు. మరో ప్రోజెక్టుకు వచ్చిన వరద ఉద్ధృతికి.. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయని పేర్కొన్నారు.
భారీ వర్షపాతం నమోదు:
తుపాను ప్రభావంతో జిల్లాలోని 51 మండలాల్లో.. నవంబర్ 25 నుంచి 27 వరకు ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయని కేంద్ర బృందానికి కలెక్టర్ వివరించారు. మూడు రోజుల్లోనూ వరుసగా 42.5, 98.4, 16.6 మి.మీ చొప్పున.. మొత్తంగా 157.17 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. 15 మండలాల్లో 10-15, 14 మండలాల్లో 15-20, 13 మండలాల్లో 20-25 సెం.మీల వర్షం కురిసిందని తెలిపారు. 25 సెం.మీ అత్యధిక వర్షపాతం కారణంగా.. రైల్వే కోడూరు మండలంలో వంతెనలు, రహదారులకు అధిక నష్టం జరిగిందన్నారు. వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహించాయని తెలిపారు.
దెబ్బతిన్న ప్రాజెక్టులు: