ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి' - కడప జిల్లాలో రక్తదాతల వార్తలు

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కడప రిమ్స్​లో రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. రక్తదానం మహాదానం అని పేర్కొన్న ఆయన... రక్తాన్ని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

kadapa collector donating blood
రక్తదానం చేస్తోన్న కడప కలెక్టర్

By

Published : Jun 14, 2020, 9:10 PM IST

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప రిమ్స్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ విభాగంలో రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ సి. హరికిరణ్ ప్రారంభించారు.

రక్తదానం మహాదానం.రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేరు. రక్తదాతలు ఎవరైనా రక్తాన్ని దానం చేసి, మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు. రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు ఉన్నవారు రక్తదానానికి అర్హులు. కనీసం రక్తదాతల శరీర బరువు 50 కిలోలు ఉండాలి. రోగ నివారణ కోసం, ప్రమాదాల సమయంలో బాధితుల శరీరంలో తగినంతగా రక్తం లేకపోతే... మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కిస్తారు.... సి.హరికిరణ్, కలెక్టర్

రక్తదాతలను శాలువా, మెమెంటో, ప్రశంసా పత్రాలతో కలెక్టర్ సత్కరించారు.

ఇదీ చూడండి: 'ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి'

ABOUT THE AUTHOR

...view details