మాజీమంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో పులివెందులకు చెందిన కృష్ణయ్య, సావిత్రి దంపతులను సీబీఐ అధికారులు రెండో సారి ప్రశ్నించారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణ కొనసాగింది.
viveka case: వివేకా హత్యకేసులో ఆ దంపతులను మరోసారి విచారణ - ఆంధ్రప్రదేశ్ వార్తలు
మాజీమంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో 25వ రోజు అనుమానితులను అధికారులు ప్రశ్నించారు. ఇవాళ పులివెందులకు చెందిన కృష్ణయ్య, సావిత్రి దంపతులను సీబీఐ అధికారులు మరోసారి ప్రశ్నించారు.
వై.ఎస్.వివేకానందరెడ్డి
కృష్ణయ్య కుటుంబం.. వివేకాతో అత్యంత సన్నిహితంగా ఉంటుందని సమాచారం. పదిరోజుల కిందట వరసగా వీరి కుటుంబాన్ని నాలుగు రోజుల పాటు ప్రశ్నించారు.
ఇదీ చదవండి:CM tour: జులై 7,8 తేదీల్లో కడప జిల్లాలో సీఎం పర్యటన