ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూగ జీవాల గొంతు తడుపుతూ... కడుపు నింపుతూ..! - badwelu

మూగ జీవాల సంరక్షణ కోసం బద్వేలు ఏవీవోపీఏ కమిటీ ఏదైనా చేయాలనుకుంది.  అనుకున్నదే తడవుగా దాతల సహాయంతో కోతులకు, గోవులకు అహారాన్ని సమకూరుస్తోంది. 6వారాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వన్యప్రాణుల.. గొంతు తడుపుతూ...కడుపు నింపుతున్నారు.. కమిటీ సభ్యులు.

మూగ జీవాల గొంతు తడుపుతూ... కడుపు నింపుతూ..!

By

Published : May 20, 2019, 12:09 AM IST

మూగ జీవాల గొంతు తడుపుతూ... కడుపు నింపుతూ..!

ఎండల వేడిమి... అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నాం. మరి నోరు లేని మూగ జీవాల పరిస్థితి. అంతరించి పోతున్న అడవుల్లోని నీటి ఎద్దడితో వన్య ప్రాణులు చుక్కనీరు, కడుపు నిండా ఆహారం దొరకని దుస్థితి నెలకొంది. ఇవన్నీ ఆలోచించి..తమ వంతు సహాయం చేయాలనుకున్నారు కడప జిల్లా బద్వేలు ఏవీవోపీఏ కమిటీ సభ్యులు. అనుకున్నదే తడవుగా గోవులకు, వానరాలకు పళ్లు, కూరగాయలు, నీటిని అందిస్తున్నారు.

దాతల నుంచి విరాళాలు...

దాతల నుంచి సేకరించిన డబ్బులతో ఆవులు, కోతులకు సంబంధించిన వస్తువులను సమకూర్చుకుంటారు. ప్రతి ఆదివారం 6గంటలకు ఏవీవోపీఏ సంఘం సభ్యులు బయలుదేరి మైదుకూరు, పోరుమామిళ్ల, సిద్ధవటం, నెల్లూరు మార్గాల్లో సుమారు 30కిలో మీటర్లు ప్రయాణించి... అడవుల్లోని కోతులకు ఆహారాన్ని అందిస్తారు. అదే విధంగా గోశాలల్లోని ఆవులకు ఆహారం సమకూరుస్తారు.

మనందరి బాధ్యత...

ఆకలితో అలమటిస్తోన్న మూగజీవాల కడుపు నింపటం... తమకు సంతృప్తినిస్తోందని దాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజలందిరిపై ఉందంటున్నారు.

ఇవీ చూడండి-విలువల చంద్రుడు... విద్యాసాగరుడు...!

ABOUT THE AUTHOR

...view details