పోలీసు అమర వీరుల కుటుంబాలను కడప జిల్లా పోలీసు శాఖ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని అదనపు ఎస్పీ కాసిం సాహెబ్ అన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన ముగ్గురు పోలీసుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే పోలీసులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పోలీసు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమన్నారు.
పోలీసు అమరవీరుల కుటుంబాలకు అదనపు ఎస్పీ సాయం - పోలీసు కుటుంబాలకు కడప అదనపు ఎస్పీ సాయం
విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు కడప జిల్లా అదనపు ఎస్పీ కాసిం సాహెబ్ ఆర్థిక సహాయాన్ని అందించారు. వారిని అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు.
![పోలీసు అమరవీరుల కుటుంబాలకు అదనపు ఎస్పీ సాయం additional sp helps to police families](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10325029-603-10325029-1611226852672.jpg)
పోలీసు కుటుంబాలకు అదనపు ఎస్పీ ఆర్థిక సాయం