130 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా! - రైల్వేకోడూరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల కబ్జా
కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్నంపల్లిలో 130 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కొంత మంది కబ్జా చేశారు. రాజకీయ నాయకుల అండదండలతో, అధికారులతో కుమ్మకై అందులో కొంత భూమిని ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు.
కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్నంపల్లిలో 130 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారు. ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వభూమి లేక తంటాలు పడుతుంటే, కొందరు అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. కొండలు, చెరువులు, ఏవైనా కనబడితే చాలు కబ్జా చేస్తున్నారు. చిన్నంపల్లి పంచాయతీ పరిధిలో 22 02 సర్వేనెంబర్‌లోని భూమి ఆర్‌ఎస్‌ఆర్‌లో ప్రభుత్వ భూమిగా ఉంది. దీన్ని కొంతమంది కబ్జా చేశారు. అయితే ఈ భూమి కొంతమంది అధికారులు, అక్కడ ఉన్న రాజకీయ నాయకుల అండదండలతో అన్లైన్లో నమోదు చేశారు. దీనిపై స్థానిక తహసీల్దార్‌ను వివరణ కోరగా ఇంత ముందు పని చేసిన అధికారులు కొంతమంది స్థానికులకు అన్లైన్లో నమోదు చేసిన మాట వాస్తవమేనని, అయితే ఈ విషయంపై అధికారులకు దృష్టికి తీసుకుపోయి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా సరే ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.