కడప జిల్లాలో జర్నలిస్టు మధుసూధన్ రెడ్డికి గతవారం కరోనా పాజిటివ్ వచ్చింది. కడప ఫాతిమా ఆస్పత్రిలో చేరారు. అక్కడ తనకు ఎలాంటి చికిత్స అందించడం లేదని ఆవేదన చెందుతూ ఒక ఆడియోని పంపించారు. తనకు ఆయాసంగా ఉందని..ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందని.. ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోవడం లేదని కలతచెందారు. ఆ తరువాత బాధితుడిని తిరుపతికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు మరణించారు. ఆఖరిసారిగా ఆయన మాట్లాడిన మాటలు...
సరైన సమయంలో చికిత్స అంది ఉంటే...!
కరోనా బారినపడి ఓ జర్నలిస్టు ప్రాణాలు విడిచారు. కరోనా వైరస్‌తో ఎన్టీవీ రిపోర్టర్ మధుసూధన్ రెడ్డి కన్నుమూశారు. మధుసూధన్ రెడ్డికి గతవారం కరోనా వైరస్ నిర్ధరణ అయింది. కడప జిల్లాకు చెందిన మధుసూధన్ రెడ్డి తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
journalist died
“ఫ్రెండ్స్ నేను ఎన్టీవీ మధూని మాట్లాడుతున్నాను. రెండురోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న ఫాతిమాలో జాయిన్ చేశారు. ఇప్పటివరకు ఎటువంటి టెస్టు చేయలేదు. ఆయాసం ఎక్కువుంది. జ్వరం ఉంది. ఎక్స్ రే , బ్లెడ్ సాంపిల్స్ తీసుకురమ్మన్నా.. అధికారులు పలకడం లేదు. మన మీడియాలో ప్రతి ఒక్కరూ భాద్యతగా ఫీలయి ఈ విషయాన్ని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా..ఇట్లు మీ మధుసూధన్ రెడ్డి”
ఇదీ చదవండి:మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Last Updated : Jul 17, 2020, 9:41 PM IST