కడప జిల్లా కొండాపురం మండలంలోని తాళ్ల పొద్దుటూరు, ఎర్రగుడి, చామలూరు తదితర గండికోట జలాశయం ముంపు గ్రామాల్లో జిల్లా సంయుక్త కలెక్టర్ గౌతమి పర్యటించారు. అర్హత కలిగిన నిర్వాసితులకి పునరావాస పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. పరిహారం అందిన వెంటనే నిర్వాసితులు తమ ఇళ్లను ఖాళీ చేయాలని కోరారు. గండికోట జలాశయంలో ఈ ఏడాది పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు జేసీ వివరించారు. తమకు పునరావాసానికి సంబంధించిన చెక్కులు, ఫ్లాట్లు ఒకేసారి అందజేయాలని బాధితులు జేసీని కోరారు.
గండికోట జలాశయం ముంపు గ్రామాల్లో జేసీ పర్యటన - కడప జిల్లా తాజా వార్తలు
గండికోట జలాశయం ముంపు గ్రామాల్లో కడప జిల్లా సంయుక్త కలెక్టర్ గౌతమి పర్యటించారు. బాధితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా సంయుక్త కలెక్టర్