కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి, సబ్ కలెక్టర్ పృథ్వీతేజ్లు రాయచోటిలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. పట్టణంలోని తిరుపతి నాయుడు కాలనీ మాసాపేట వరిగ రోడ్డు ప్రాంతాల్లోని భూముల విస్తీర్ణం, సర్కారు కార్యాలయాల ఏర్పాటుకు అనువైనవా? కాదా? అనే అంశాలను స్థానిక రెవెన్యూ అధికారులతో చర్చించారు. డీఎస్పీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు త్వరలోనే స్థలాలు కేటాయిస్తామని ఆమె పేర్కొన్నారు.
రాయచోటిలో జాయింట్, సబ్ కలెక్టర్లు ప్రభుత్వ స్థలాల పరిశీలన - kadapa sub collector latest news
కడప జిల్లా రాయచోటిలోని ప్రభుత్వ స్థలాలను జాయింట్, సబ్ కలెక్టర్లు పరిశీలించారు. వాటి విస్తీర్ణం, కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి అధికారులతో చర్చించారు. భూ నిర్వాసితులకు పరిహారం అందించి ఆదుకుంటామని తెలిపారు.
కడప-బెంగళూరు రైలు మార్గాన్ని పరిశీలించి భూనిర్వాసితులకు ఇచ్చే పరిహారంపై చర్చించారు. పట్టణ సమీపంలో భూములు కోల్పోతున్న వారికి ఎకరాకు రూ.35 లక్షలు చెల్లించాలని రైతులు కోరారు. ఈ విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి వారిని ఆదుకుంటామని ఆమె తెలిపారు. మాసాపేటలో పది రోజులుగా కొనసాగుతున్న సీపీఐ నాయకుల నిరసన శిబిరాలను పరిశీలించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరగా.. అర్హులైన వారికి త్వరలో అందేలా చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: కాంపల్లి చెరువుకు గండి..ప్రవాహం ఆపేందుకు గ్రామస్థుల యత్నం