ఉక్కు పరిశ్రమ సాధ్యాసాధ్యాల పరిశీలన - కడప జిల్లా
కడప జిల్లాలో జిందాల్ స్టీల్ వర్క్స్ కంపెనీ ప్రతినిధులు పర్యటించారు. జమ్మలమడుగు వద్ద బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం ప్రాంతాన్ని పరిశీలించారు.
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన తరుణంలో వివిధ సంస్థలు ముందుకొస్తున్నాయి. "జిందాల్ స్టీల్ వర్క్స్" కంపెనీ ప్రతినిధులు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం జిల్లాలో పర్యటించారు. జమ్మలమడుగు సమీపంలో నిలిచిపోయిన బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం ప్రాంతాన్ని పరిశీలించారు. నీటి వసతి, భూమి, రహదారి, రవాణా తదితర వివరాలను ఆరా తీశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించిన తర్వాత తమ అభిప్రాయం తెలియజేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ వారంలోనే... చైనా, సౌత్ కొరియాకు చెందిన ఉక్కు పరిశ్రమ ప్రతినిధులు కూడా జిల్లాకు వస్తారని అధికారులు చెబుతున్నారు.