ఈ నెల 26న తలపెట్టిన భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని కడప జిల్లా సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య.. ప్రజలను కోరారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు, నూతన విద్యుత్ విధానం రద్దు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణ అపాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ...కడపలో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీపు జాతర నిర్వహించారు. ఈ జాతర ద్వారా జిల్లాలోని 50 మండలాల్లో పర్యటించి బంద్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి ఒక రైతు రోడ్లపైకి వచ్చి స్వచ్చంధంగా బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
విశాఖ జిల్లాలో...
ఈ నెల 26 న భారత్ బంద్ సందర్భంగా విశాఖ జిల్లా ముంచంగిపట్టులో సీపీఎం నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయవద్దని, స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కె. త్రినాథ్, ఎం ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు.