మట్టి అక్రమ తవ్వకాలపై అధికారుల దాడులు - రెండు జేసీబీలు, ఒక ట్రాక్టరును స్వాధీనం
కడప జిల్లా మైదుకూరు సమీపంలోని గగ్గితిప్ప వద్ద అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్నా సమాచారం మేరకు భూగర్భగనుల శాఖ అధికారులు దాడులు చేశారు. రెండు జేసీబీలు, ఒక ట్రాక్టరును స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ మట్టి తవ్వకాలు అధికారుల దాడులు
కడప జిల్లా మైదుకూరు సమీపంలోని గగ్గితిప్ప వద్ద అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్నా సమాచారంతో భూగర్భగనుల శాఖ అధికారులు దాడులు చేశారు. రెండు జేసీబీలు, ఒక ట్రాక్టరును స్వాధీనం చేసుకున్నారు. కొద్దిరోజులుగా గగ్గితిప్ప పరిసరాల్లో మట్టి తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో దాడులు చేశామని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తుండగా దాడులు నిర్వహించామని.. స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.