ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన బడి నాడు - నేడు పనులు పరిశీలించిన జేసీ - మన బడి నాడు-నేడు పనులు పరిశీలించిన జాయింట్ కలెక్టర్

కడప జిల్లా సుండుపల్లె మండలంలోని పలు పాఠశాలల్లో జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ పర్యటించారు. మన బడి నాడు - నేడు పనులను పరిశీలించారు.

jc saikanth varma visit at sundupalli mandal in kadapa district
మన బడి నాడు-నేడు పనులు పరిశీలించిన జాయింట్ కలెక్టర్

By

Published : Oct 21, 2020, 11:45 PM IST

కడప జిల్లా సుండుపల్లె మండలంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ పర్యటించారు. గుట్ట కింద రాచపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బెస్తపల్లి తెలుగులోని మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. మన బడి నాడు-నేడు పనులను పరిశీలించారు. రాచపల్లి పాఠశాలలో పెండింగులో ఉన్న పనులు 15 రోజుల్లోగా పూర్తి చేయాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివయ్యను ఆదేశించారు. బెస్తపల్లిలో పాఠశాలలో జరిగిన పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

పాఠశాలను పరిశీలిస్తున్న జాయింట్​ కలెక్టర్​

అనంతరం.. ఈడిగపల్లి, మడితాడు గ్రామ సచివాలయాలను సందర్శించారు. సిబ్బందికు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి ప్రభాకర్ రెడ్డి, మండల తహసీల్దార్ కనకదుర్గయ్య, మండల అభివృద్ధి అధికారి రామచంద్ర రెడ్డి, మండల విద్యాశాఖాధికారి బి. వెంకటేశ్ నాయక్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details