ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న తాడిపత్రి మాజీ శాసనసభ్యులు, తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈ ఉదయం అనంతపురం పోలీసులు ఒక్కరోజు విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అనంతపురానికి తీసుకెళ్లారు. అక్రమ వాహనాల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అశ్విత్ రెడ్డిలకు పది రోజుల కిందట బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు భారీ ఎత్తున కేంద్ర కారాగారానికి చేరుకొని అనుమతి లేకుండా ర్యాలీతో తాడిపత్రి వరకు వెళ్లారు. కోవిడ్ నిబంధనలు వ్యతిరేకించారని, పైగా తాడిపత్రిలో సీఐను దూషించారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. ఈ మేరకు వారం రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డిని కడప కేంద్ర కారాగారానికి తీసుకువచ్చారు.
ఇవీ చదవండి
అనంతపురం పోలీస్ కస్టడీకి జేసీ ప్రభాకర్ రెడ్డి - జేసీ ప్రభాకర్ రెడ్డి వార్తలు
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారించేందుకు అనంతపురం పోలీసులు కోర్టు అనుమతి తీసుకుని ఒక్కరోజు కస్టడీకి తీసుకున్నారు. తిరిగి సాయంత్రం ఆయన కడప కేంద్ర కారాగారానికి తీసుకురానున్నారు.
అనంతపురం పోలీస్ కస్టడీలో జేసీ ప్రభాకర్ రెడ్డి