కడప జిల్లా మైలవరం మండలంలో సంయుక్త కలెక్టర్ గౌతమి పర్యటించారు. దొడియం, రామచంద్రయ్యపల్లె గ్రామాల్లో... సౌర పరిశ్రమకు కేటాయించిన భూములు పరిశీలించారు. రామచంద్రయ్యపల్లెలో 40 మంది రైతులకు... నూట ఎనిమిది ఎకరాల పొలం ఉండగా ...అందులో 22 మందికి ఒక ఎకరా ఆరు లక్షల యాభై వేలు చొప్పున పరిహారం ఇచ్చామన్నారు. మిగిలిన 23 మందితో పాటు దొడియం గ్రామంలో 80 మంది సౌర పరిశ్రమ కోసం భూములను ఇచ్చినట్లు ఆమె చెప్పారు. వారికి త్వరలోనే ఒక ఎకరా ఆరు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామన్నారు.
మైలవరంలో సంయుక్త కలెక్టర్ గౌతమి పర్యటన - సౌరపరిశ్రమకు కేటాయించిన భూములను పరిశీలించిన గౌతమి
కడప జిల్లా సంయుక్త కలెక్టర్ గౌతమి మైలవరంలోని దొడియం, రామచంద్రయ్య పల్లె గ్రామాల్లో సౌర పరిశ్రమకు కేటాయించిన భూములను పరిశీలించి.... 22 మందికి ఒక ఎకరా భూమికి 6లక్షల 50వేలు చొప్పున పరిహారం అందించారు.
మైలవరంలో సంయుక్త కలెక్టర్ పర్యటన