రాష్ట్రంలో భాజపా ప్రభంజనం మొదలైంది: జేసీ - రాష్ట్రంలో భాజపా ప్రభంజనం మొదలైంది: జేసీ
తన వ్యాఖ్యలతో అందరిలోనూ ఆసక్తిని పెంచే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి... మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కమలం పార్టీ ప్రభంజనం మొదలైందని అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన... భాజపా ఎదుగదలలో తెదేపా అధినేత చంద్రబాబు పాత్ర కొంత పరోక్షంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. జమిలీ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల ఉనికే ప్రమాదమని జోస్యం చెప్పారు.
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భాజపా ప్రభంజనం మొదలైందని తెలిపారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఎక్కువైనా కావచ్చని... లేదా నామమాత్రంగానైనా ఉండొచ్చని అభిప్రాయప్డారు. దాంట్లో తెదేపా అధినేత చంద్రబాబు పాత్ర కొంత పరోక్షంగా ఉంటుందన్నారు. చంద్రబాబు ఆలోచనలపైనే రాష్ట్రంలో భాజపా ఎదుగుదల ఆధారపడి ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఆలోచనలపై ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయని... జమిలీ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. భాజపాలో చేరికపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ....తాను భాజపాలోకి ఎందుకు వెళ్తానని మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు.