కరోనా వ్యాప్తి నివారణకు జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రజలు స్వచ్ఛందంగా.. కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ప్రజలు ఉదయం 7 గంటల నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. రద్దీగా ఉండే శివాలయం కూడలి, గాంధీ రోడ్డు, మైదుకూరు రోడ్డు వెలవెలబోతున్నాయి. పట్టణంలో బంగారం, వస్త్ర, వ్యాపార దుకాణాలను మూసివేశారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలు అన్నీ నిలిపివేశారు.
ప్రొద్దుటూరులో జనతా కర్ఫ్యూ - కడపలో జనతా కర్ఫ్యూ
ప్రధాని పిలుపు మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూని పాటిస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర సేవలు తప్పా అన్నీ రద్దయ్యాయి.
Janata curfew continues at Prodduturu in Kadapa district.