నేడు కడపలో పవన్ పర్యటన - ttd kalyana mandapam
జనసేనాని రాయలసీమ పర్యటనలో భాగంగా నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రోడ్డు షో నిర్వహించి.. సాయంత్రం బహిరంగ సభకు హాజరుకానున్నారు.
కడపలో పవన్ పర్యటన(ఫైల్)
కడప జిల్లాలో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. మైదుకూరు మీదుగా రోడ్ షో నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు కడప చేరుకోనున్నారు. అనంతరం నగరంలోని ఆర్చ్ గేట్ నుంచి దేవుని కడప, మార్కెట్ యార్డ్, కృష్ణ సర్కిల్ మీదుగా అన్నమయ్య కూడలి వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు టీటీడీ కల్యాణ మండపం వద్ద బహిరంగ సభకు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.