ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గండికోట ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలి: జనసేన - గండికోట ప్రాజెక్టు వార్తలు

గండికోట ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలన్నారు.

Gandikota Project Victims
Gandikota Project Victims

By

Published : Sep 9, 2020, 10:51 PM IST

గండికోట ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. లేదంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన... గండికోట ముంపు బాధితులకు తీరని అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.

కనీసం ప్రత్యామ్నాయ వసతులు చూపకుండానే నివాసాలను ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం దారుణమని అన్నారు. రెవెన్యూ అధికారులు అవలంబిస్తున్న వైఖరి సరిగా లేదని విమర్శించారు. నిబంధనల ప్రకారం నిర్వాసితులందరికీ ఇల్లు, రోడ్లు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించిన తర్వాత అక్కడి నుంచి ఖాళీ చేయించాలని సూచించారు. అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనలో వైఎస్ జగన్ మద్దతు ఉన్నట్ల అనుమానం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details