నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా మైదుకూరు తహసీల్దారు కార్యాలయం వద్ద జనసేన నాయకులు దీక్ష చేపట్టారు. పార్టీ నియోజకవర్గ బాధ్యుడు పందిటి మల్హోత్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెట్టుబడి కూడా దక్కని విధంగా పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. నష్టపోయిన రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. రైతులకు తక్షణసాయంగా ఎకరాకు పది వేలు చెల్లించాలని, పూర్తి సాయంగా రూ.35వేలు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులకు తక్షణమే పరిహారం అందించాలి: జనసేన నాయకుల దీక్ష - pandinti malhotra news
కడప జిల్లా మైదుకూరు తహసీల్దారు కార్యాలయం ఎదుట జనసేన నాయకులు దీక్ష చేపట్టారు. వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
జనసేన నాయకుల దీక్ష