ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే... రాష్ట్రంలో ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ హయాంలో..3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు... సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో 40 మందికి పైగానే ఆత్మహత్య చేసుకున్నట్లు రికార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఈనెల 20వ తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కడపజిల్లాలో పర్యటిస్తున్నారని తెలిపారు. సిద్ధవటంలో బాధిత రైతు కుటుంబాలను పరామర్శించి... వారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తారని చెప్పారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారని తెలిపారు.
పులివెందులలోనే 40 మందికి పైగానే ఆత్మహత్యలన్న జనసేన నాదేండ్ల - Rythu Bharosa yatra in kadapa
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే, రాష్ట్రంలో ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ ప్రశ్నించారు.
jsp