మాస్కులు ఉంటేనే ప్రజలకు ఇంటి సరుకులు ఇవ్వాలని దుకాణ యజమానులను పోలీసులు ఆదేశించారు. ఈ విధానం పాటించని వారి గురించి పోలీసులకు సమాచారం అందజేయాలని సీఐ మధుసూధనరావు సూచించారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ పోలీసులు ఓ గోడ పత్రిక విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని దుకాణ యజమానులు హాజరయ్యారు. ఈ గోడ పత్రికను దుకాణదారులకు అందజేశారు. పోలీసులు నిఘా పెట్టినా... ఇంకా కొంత మంది ప్రజలు మాస్కులు ధరించడం లేదని... వారిలో యువత ఎక్కువగా ఉండటం బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
'మాస్కులు ఉంటేనే సరుకులు ఇవ్వండి'
మాస్కులు ఉంటేనే ప్రజలకు సరుకులు ఇవ్వాలని కడప జిల్లా జమ్మలమడుగులో పట్టణ పోలీసులు ఆదేశించారు. దుకాణ యజమానులతో నిర్వహించిన సమావేశంలో సీఐ మధుసూధనరావు మాట్లాడారు. మాస్కులు ఉంటేనే ప్రజలకు సరుకులు ఉవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి చేయవచ్చని సీఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోడ పత్రిక విడుదల చేసి యాజమానులకు అందజేశారు.
గోడ పత్రిక విడుదల చేసిన జమ్మలమడుగు పోలీసులు