మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సహా మరో 84 మందిపై కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 14వ తేదీ రాత్రి జమ్మలమడుగు మండలం దేవగుడి సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెడ్డయ్య, రామాంజనేయులు అనే వ్యక్తులపై దాడి చేశారు. వారిపై దాడికి దిగింది భాజపా నేత ఆదినారాయణరెడ్డి మనుషులే అని ఆరోపిస్తూ అదే రోజు రాత్రి జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. విచారణ అనంతరం మాజీ మంత్రి సహా మరో 84 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ మధుసూదన్‌రావు తెలిపారు.
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు - adinarayana reddy case issue
కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి సమీపంలో ఈనెల 14న ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సహా మరో 84 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు
TAGGED:
adinarayana reddy case issue