Jagananna Colony as a Pond: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరు మండలంలో జగనన్న కాలనీ చెరువును తలపిస్తోంది. మండల పరిధిలోని కనపర్తి గ్రామంలో జగనన్న కాలనీలో ప్రభుత్వం 1050 మందికి ఇళ్ల స్థలాలను మంజూరు చేసింది. లోతట్టు ప్రాంతం కావడంతో లబ్ధిదారులు నిర్మాణాలను చేపట్టేందుకు ముందుకు రాలేదు. విధి లేక పాలకులు ఇళ్ల నిర్మాణ పనులను గుత్తేదారునికి కట్టబెట్టారు. ప్రభుత్వ వాటా రూ. లక్షా ఏబై వేలు... లబ్ధిదారుని వాటా రూ.35 వేలు. ఉపాధి హామీ రూ.30 వేలు కలిపి మొత్తం రూ.2 లక్షల 15 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులను గుత్తేదారునికి చెల్లింపు చేశారు. గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు లేఅవుట్ లోని నిర్మాణాలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ జిల్లాలో చెరువును తలపిస్తున్న జగనన్న కాలనీ - జగనన్న కాలనీ
Jagananna Colony as a Pond : వైఎస్సార్ జిల్లాలో జగనన్న కాలనీలపై ప్రజలు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతంలో స్థలాలు కేటాయించడంతో.. రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు నీట మునిగాయి. ప్రస్తుతం ఇవి చెరువును తలపిస్తున్నాయి. వీటి నిర్మాణాలను ప్రభుత్వం గుత్తేదారునికి కట్టబెట్టింది.
జగనన్న కాలనీ