ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

500 కోట్లు... 31 కేసులు... ఈసీకి జగన్ లెక్కలు - 2019 elections

దేశంలోనే సంపన్న రాజకీయనేతల్లో ఒకరైన వైకాపా అధ్యక్షుడు జగన్​మోహన్​రెడ్డి ఆస్తుల విలువ 500 కోట్లు దాటింది. వైకాపా తరఫున పులివెందుల నుంచి నామినేషన్ వేసిన ఆయన శుక్రవారం ఎన్నికల సంఘానికి తన ఆస్తుల వివరాలు తెలిపారు. జగన్... తన కుటుంబానికి 510 కోట్ల 38 లక్షల 16 వేల 566 రూపాయల ఆస్తులున్నట్లు అఫిడవిట్ సమర్పించారు. కిందటి దఫాతో పోలిస్తే.. జగన్ కుటుంబ ఆస్తుల విలువ సుమారు 93 కోట్ల 69లక్షలు పెరిగింది. తనపై 31 కేసులున్నట్లు జగన్ అఫిడవిట్​లో పేర్కొన్నారు.

వైకాపా అధ్యక్షుడు జగన్​మోహన్​రెడ్డి

By

Published : Mar 22, 2019, 7:06 PM IST

Updated : Mar 22, 2019, 10:03 PM IST

రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కుటుంబ స్థిర, చరాస్తులు ఈ ఐదేళ్లలో 93 కోట్లకుపైగా పెరిగాయి. కడప జిల్లా పులివెందుల నుంచి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ వేసిన జగన్... ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు. దీని ప్రకారం జగన్... ఆయన భార్య భారతి, కుమార్తె పేరు మీద ఉన్న మొత్తం ఆస్తుల విలువ 510, 38, 16, 566 రూపాయలు. 2014లో ఆయన కుటుంబ ఆస్తులు 416 కోట్లు 68లక్షలు. జగన్ పేరిట ఉన్న స్థిర చరాస్తులు 375, 20, 19, 726 రూపాయలు. వైఎస్ భారతి పేరు మీద రూ. 124, 12, 52, 277, కుమార్తెలు హర్షిణీరెడ్డి, వర్షారెడ్డిల పేరు మీద 11, 05, 44, 563 రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్​లో పొందుపరిచారు.

31 కేసులు...
జగన్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్​లో తనపై 31 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులతోపాటు... పలు సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసులు నమోదయ్యాయని వివరించారు. హైదరాబాద్, సరూర్​నగర్, మంగళగిరి, నందిగామలో జగన్​పై కేసులు నమోదైనట్లు అఫిడవిట్​లో పొందుపర్చారు. 2014 ఎన్నికల అఫిడవిట్​లో 10 సీబీఐ అభియోగాలు, కమలాపురం కోర్టులో ఒక కేసు విచారణ దశలో ఉందని... ఈడీ కేసుతోపాటు మరో 3 కేసులు ఎఫ్‌ఐఆర్ దశలో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

జగన్‌ మొత్తం చరాస్తుల విలువ

రూ. 339,89,43,352
జగన్ మొత్తం స్థిరాస్తుల విలువ
రూ.35,30,76,374
పెట్టుబడులు
రూ.317,45,99,618
అప్పులు
రూ.119.21 కోట్లు

జగన్ కుటుంబ సభ్యుల ఆస్తుల సమగ్ర వివరాలు...

స్థిరాస్తులు
జగన్ పేరిట ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం స్థిరాస్తులు రూ.35,30,76,374
తన భార్య భారతి పేరిట ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం స్థిరాస్తులు రూ.31,59,02,925

చరాస్తులు
జగన్‌ మొత్తం చరాస్తుల విలువ రూ.339,89,43,352
భారతి మొత్తం చరాస్తుల విలువ రూ.92,53,49,352
జగన్‌ పెద్దకుమార్తె హర్షిణీరెడ్డి చరాస్తుల విలువ రూ.6,45,62,191
జగన్ చిన్నకుమార్తె వర్షారెడ్డి చరాస్తుల విలువ రూ.4,59,82,372

అప్పులు
జగన్ పేరిట మొత్తం అప్పులు రూ.1,19,21,202

పెట్టుబడులు
జగన్ మొత్తం పెట్టుబడుల విలువ రూ.317,45,99,618
భారతి మొత్తం పెట్టుబడుల విలువ రూ.62,35,01,849
జగన్ పెద్దకుమార్తె హర్షిణీరెడ్డి పెట్టుబడుల విలువ రూ.1,18,11,358
జగన్ చిన్నకుమార్తె వర్షారెడ్డి పెట్టుబడుల విలువ రూ.24,27,058

ఆభరణాలు
జగన్ పేరిట ఆభరణాలు ఏమీ లేవని అఫిడవిట్​లో పేర్కొన్న జగన్...
భారతికి రూ.3,57,16,658 విలువైన 5,862.818 గ్రాముల బంగారు, వజ్రాభరణాలు
జగన్ పెద్ద కుమార్తె హర్షిణిరెడ్డికి రూ.3,16,13,435 విలువైన 4,187.193 గ్రాముల బంగారు, వజ్రాభరణాలు
జగన్ చిన్న కుమార్తె వర్షారెడ్డి పేరిట రూ.3,12,46,415 విలువైన 3,457.331 గ్రాములు బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లు అఫిడవిట్​లో పొందుపర్చారు.

చేతి నగదు
జగన్ చేతిలో ఉన్న నగదు రూ. 43560
జగన్ సతీమణి భారతి చేతినగదు రూ.49390
జగన్ పెద్ద కుమార్తె హర్షిణి రెడ్డి చేతి నగదు రూ.1000
జగన్ చిన్న కుమార్తె వర్షారెడ్డి చేతి నగదు రూ.7440

బ్యాంక్‌ ఖాతాల్లో నగదు నిల్వలు
బెంగళూరులోని ఓరియంటల్ బ్యాంక్‌ ఆఫ్ కామర్స్‌లోని జగన్ ఖాతాలో నగదు రూ.20,20,083
జగన్ సతీమణి భారతి పేరు మీద బెంగళూరులోని యాక్సిస్ బ్యాంకులో నగదు నిల్వ రూ.9,69,686
జగన్ కుమార్తె హర్షిణి పేరు మీద బెంగళూరులోని యాక్సిస్ బ్యాంకు ఖాతాలో రూ.70,00,00
జగన్ చిన్న కుమార్తె వర్షారెడ్డి పేరు మీద బెంగళూరులోని యాక్సిస్ బ్యాంకు ఖాతాలో రూ.34,00,000

*జగన్ కుటుంబంలో ఎవ్వరి పేరు మీద ఎలాంటి వాహనాలు లేవని అఫిడవిట్​లో పేర్కొన్నారు.

బ్యాంకు డిపాజిట్లు...
బెంగళూరు ఓరియంటల్ బ్యాంక్‌ ఆఫ్ కామర్స్‌లో జగన్‌కు రూ.1,25,32,855
హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంకు శాఖలో జగన్‌కు రూ.21,44,746
హైదరాబాద్‌ మల్కాజిగిరి హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్‌లో జగన్‌కు రూ.25 వేలు
బెంగళూరు ఓరియంటల్‌ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో భారతి పేరిట రూ.5,73,701
బెంగళూరు ఓరియంటల్‌ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో భారతి పేరిట రూ.20,90,821
బంజారాహిల్స్‌ ఓరియంటల్ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లో భారతి పేరిట రూ.8,09,884
బెంగళూరు యాక్సిస్ బ్యాంక్‌లో భారతి పేరిట రూ.17,41,087
పులివెందుల ఎస్‌బీఐలో భారతి పేరిట రూ.21,37,480
యాక్సిస్ బ్యాంక్‌ ట్రావెల్‌ కార్డులో భారతి ఖాతాలో రూ.1,09,500
హర్షిణి పేరు మీద బెంగళూరు యాక్సిస్ బ్యాంకులో రూ.51,38,114
లండన్‌లోని నాట్‌వెస్ట్‌లో హర్షిణి ఖాతాలో రూ.2,05,660
వర్షారెడ్డి పేరు మీద బెంగళూరు యాక్సిస్ బ్యాంకులో రూ.2,07,115 మేర డిపాజిట్లున్నాయి.

Last Updated : Mar 22, 2019, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details