కరోనాను దేశ విపత్తుగా కేంద్రమే ప్రకటించిన విషయాన్ని మరిచి పోయారా? అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి సీఎంను ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని ఆయన అన్నారు. అలాగే చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు, ఎస్పీలను బదిలీలను కూడా సమర్ధిస్తోందని తెలిపారు. ఎవరు ఏ పదవిలో ఎలాంటి విధులు నిర్వహించాలనేది రాజ్యాంగంలో పొందు పరిచారని..., ఆ విషయం తెలియక జగన్ ఎన్నికల కమిషనర్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్‌కు సామాజిక వర్గం అంటగట్టడం ఏంటన్న తులసిరెడ్డి.... ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి జగన్ అనర్హుడని వ్యాఖ్యానించారు. ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు రావని జగన్ ఆందోళన చెందుతున్నారని..., కేంద్రానికి కరోనా విషయంపై లేఖ రాస్తే నిధులు విడుదల కావా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిగా జగన్ అనర్హుడు: తులసి రెడ్డి - undefined
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌పై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆక్షేపించారు. కరోనా సాకు చూపి ఎన్నికలు వాయిదా వేశారని ఎన్నికల సంఘాన్ని సీఎం తప్పుపట్టడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రిగా జగన్ అనర్హుడు -తులసి రెడ్డి