ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు: సజ్జల - సజ్జల తాజా వార్తలు

కడప జిల్లా జమ్మలమడుగు వైకాపా నేత రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. 2024లో జమ్మలమడుగు నుంచి సుధీర్‌రెడ్డి పోటీ చేస్తారన్నారు. డీలిమిటేషన్ తర్వాత జమ్మలమడుగు 2 స్థానాలు అవుతుందన్నారు. అప్పుడు చెరోచోట నుంచి రామసుబ్బారెడ్డి, సుధీర్‌రెడ్డి పోటీ చేస్తారని సజ్జల పేర్కొన్నారు.

MLC to Ramasubbareddy
రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ

By

Published : Apr 9, 2021, 7:13 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు వైకాపా నేత రామసుబ్బారెడ్డి ముఖ్యమంత్రి జగన్​ను కలిశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. నా వెంట వచ్చిన వారికి గౌరవం, గుర్తింపు ఇవ్వాలని సీఎం జగన్​ను కోరినట్లు రామసుబ్బారెడ్డి తెలిపారు. క్రియాశీలక గుర్తింపు ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో సుధీర్‌రెడ్డికి మద్దతిస్తామని రామసుబ్బారెడ్డి తెలిపారు.

రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ..

రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు సజ్జల స్పష్టం చేసారు. ఎంపీ, ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకోవాలని రామసుబ్బారెడ్డికి సీఎం సూచించినట్లు తెలిపారు. 2024లో జమ్మలమడుగు నుంచి సుధీర్‌రెడ్డి పోటీ చేస్తారన్నారు. డీలిమిటేషన్ తర్వాత జమ్మలమడుగు 2 స్థానాలు అవుతుందన్నారు. అప్పుడు చెరోచోట నుంచి రామసుబ్బారెడ్డి, సుధీర్‌రెడ్డి పోటీ చేస్తారని సజ్జల పేర్కొన్నారు.

ఇదీచదవండి

'కేసుల నుంచి ఎలా బయటపడాలనేదే సీఎం జగన్‌ ఆలోచన'

ABOUT THE AUTHOR

...view details