ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేసీ కాల్వ ఆయకట్టుకు సాగునీరు విడుదల - ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

కడప జిల్లాలోని కేసీకాల్వ ఆయకట్టు కోసం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సాగునీరు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా ప్రభుత్వం కేసీ ఆయకట్టుకు నీటిని విడుదల చేసిందన్నారు.

kadapa district
కేసీకాల్వ ఆయకట్టుకు సాగునీరు విడుదల

By

Published : Aug 1, 2020, 4:22 PM IST

కేసీకాల్వ ఆయకట్టు కోసం సాగునీరు విడుదల చేశారు. కర్నూలు, కడప జిల్లాలోని రాజోలి ఆనకట్ట వద్ద ఎమ్మెల్యే రఘురామిరెడ్డితోపాటు అధికారులు పూజలు నిర్వహించి నీరు విడుదల చేశారు. తొలుత 250 క్యూసెక్కుల చొప్పున కాల్వలోకి నీరు విడుదల చేయగా..నీటి ప్రవాహం పెరిగేకొద్దీ అంచెలంచెలుగా 450 క్యూసెక్కులు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఖరీఫ్‌ వరి పంటకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. రైతులు ఎలాంటి అపోహలు లేకుండా వరి సాగు చేసుకోవచ్చన్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయిలో నిండుతుంద‌ని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా ప్రభుత్వం కేసీ ఆయకట్టుకు నీటిని విడుదల చేసిందన్నారు.

ఇదీ చదవండిపులివెందుల ప్రాజెక్టులకు త్వరితగతిన నిధులు : సీఎం

ABOUT THE AUTHOR

...view details