ముఖ్యమంత్రి సహాయ నిధి నకిలీ చెక్కుల కేసుల విచారణ వేగవంతం అయింది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నకిలీ చెక్కులు సమర్పించి కడప జిల్లా ప్రొద్దుటూరులో మొత్తం 9.95 లక్షలు నగదు డ్రా చేశారన్న బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో మూడు రోజుల క్రితం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో గురువారం ప్రధాన నిందితుడు చాపాడు మండలం వెంగన్నగారిపల్లెకు చెందిన భాస్కర్‌రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.
సీఎం సహాయనిధి నకిలీ చెక్కుల వ్యవహారంపై విచారణ ముమ్మరం - సీఎం సహాయ నిధి నకిలీ చెక్కులపై వార్తలు
సీఎం సహాయనిధి నకిలీ చెక్కుల వ్యవహారంపై విచారణ ముమ్మరం చేశారు. భాస్కర్‌రెడ్డి స్నేహితుడి కోసం ప్రత్యేక బృందంతో విస్తృతంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరికొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ప్రొద్దుటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో పని చేస్తున్న ఓ వ్యక్తి వద్ద మూడు పాత సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు తీసుకుని వాటిని తమిళనాడు రాష్ట్రం హోసూర్‌లోని తన స్నేహితుడికి పంపానని, అతను చెక్కుల్లో ఎక్కువ మొత్తం రాసి పంపడంతో నగదు డ్రా చేసినట్లు భాస్కర్‌రెడ్డి గురువారం స్వయంగా మీడియాకు చెప్పాడు. ఈ కేసులో భాస్కర్‌రెడ్డి స్నేహితుడు కీలకంగా మారాడు. అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందంతో విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో మరికొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: సీఎం సహాయనిధి నకిలీ చెక్కులు వ్యవహారంపై పోలీసు కేసు నమోదు