వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు చెందిన నలుగురు అనుమానితులను సిట్ అధికారులు కడపలో విచారిస్తున్నారు. నిన్న నలుగురిని విచారించిన పోలీసులు... ఇవాళ మరో నలుగురి విచారణకు పిలిచారు. పులివెందుల నుంచి వై.ఎస్.మనోహర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని కడపకు పిలిచి విచారించారు.
వివేకాకు ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అనే కోణంలో విచారించినట్లు తెలిసింది. మనోహర్ రెడ్డిని నిన్న కూడా పోలీసులు విచారణకు పిలిచారు. సింహాద్రిపురం మండలానికి చెందిన తెదేపా మాజీ జెడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ముసల్ రెడ్డిపల్లెకు చెందిన నాయకున్ని విచారణకు పిలిచారు. వీరు నలుగురిని కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రంలో సిట్ విచారిస్తోంది. గతంలో కూడా వీరందరినీ సిట్ అధికారులు విచారించారు. మూడు నెలల తర్వాత మరోసారి విచారణ చేస్తున్నారు.