మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (viveka murder case) సీబీఐ వేసిన పిటిషన్‌పై పులివెందుల కోర్టులో విచారణ జరిగింది. మున్నాను పులివెందుల కోర్టులో హాజరుపరిచిన సీబీఐ అధికారులు.. నార్కో పరీక్షల కోసం పిటిషన్ వేశారు. నార్కో పరీక్షలకు మేజిస్ట్రేట్ ఎదుట మున్నా అంగీకారం తెలపడంతో.. సీబీఐకి పులివెందుల కోర్టు అనుమతిచ్చింది. గతేడాది మున్నాకు చెందిన రూ.50 లక్షలకు పైగా నగదును సీబీఐ అధికారులు గుర్తించారు.
ఇక హత్య కేసులో సీబీఐ విచారణ 112వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలుమార్లు దస్తగిరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా హత్య జరగడానికి ఆరు నెలల ముందు దస్తగిరి పని మానేశాడు. ఇతడు ఇచ్చిన కొన్ని కీలక ఆధారాలతో సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.